News August 31, 2024
Z ప్లస్ సెక్యూరిటీని తిరస్కరించిన పవార్!

NCP(SP) అధినేత శరద్ పవార్ తనకు కేటాయించిన Z ప్లస్ సెక్యూరిటీని తిరస్కరించినట్లు తెలుస్తోంది. తనకు ఎలాంటి ముప్పు ఉందో అంచనా వేశాక సెక్యూరిటీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేసినట్లు వార్తలొస్తున్నాయి. Z ప్లస్ సెక్యూరిటీలో భాగంగా 58మంది భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు వాహనాల మార్పు, ఇంటి సరిహద్దు గోడ ఎత్తును పెంచడం వంటి చర్యలు ఉంటాయి.
Similar News
News December 26, 2025
సంక్రాంతికి రైతుభరోసా..!

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News December 26, 2025
మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

మామిడి చెట్లలో అక్కడక్కడ పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్, JAN నెలల్లో రైతులు తీసుకునే చర్యలు మామిడి పూతను నిర్ణయిస్తాయి. ఈ సమయంలో పంటకు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ముప్పు ఎక్కువ. వాటి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటూనే చెట్లలో సూక్ష్మపోషకాల లోపాన్ని గుర్తించి అవసరమైన మందులను నిపుణుల సూచనలతో పిచికారీ చేయాలి. మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 26, 2025
వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


