News May 4, 2024

పవార్ కుమార్తె వర్సెస్ పవార్ భార్య

image

మహారాష్ట్రలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే NCP తమదంటే తమదంటూ శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పోరు జరుగుతోంది. ఇదిలా ఉంటే బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా.. ఆమెపై అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2009 నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు. అయితే NCP అజిత్ వర్గానికి చిక్కడంతో ఆమె ఈసారి కొత్త గుర్తుతో పోటీ చేయాల్సి వస్తోంది.

Similar News

News November 8, 2025

పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

image

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News November 8, 2025

సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

image

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.

News November 8, 2025

‘ఓట్ చోరీ’.. యువతి సెల్ఫీ దుమారం!

image

ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా ఓ లాయర్ సెల్ఫీ వైరలవుతోంది. పుణేకు చెందిన ఉర్మీ అనే లాయర్ బిహార్‌లో ఎన్నికల రోజు.. ‘Modi-Fied ఇండియా కోసం ఓటేశాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫాలోవర్స్ ఆమె అకౌంట్‌ను పరిశీలించగా.. గతంలో ‘పుణే ఎన్నికల్లో ఓటేశాను’ అని మరో ఫొటో ఉంది. ఇలాగే ఓటేస్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.