News June 16, 2024

పేదోడి ఇల్లు.. పెత్తందారుడు కట్టుకున్న బాత్ రూమ్: TDP

image

AP: విశాఖ రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై టీడీపీ Xలో విమర్శలు గుప్పిస్తోంది. ‘భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూతో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు. మళ్ళీ పేదలు, పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేశాడు. పేదోడి కోసం కట్టిస్తానన్న ఇల్లు, పెత్తందారుడు కట్టుకున్న బాత్‌రూమ్’ అని Xలో ఓ ఫొటోను పంచుకుంది.

Similar News

News April 2, 2026

పోలవరంలో కీలక ఘట్టం పూర్తి: చంద్రబాబు

image

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.వెయ్యి కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. దీంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

News April 2, 2026

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

image

ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పొరుగు దేశం(పాకిస్థాన్) కవ్విస్తే అంతకు రెట్టింపు సమాధానం చెబుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కేరళలో సైనిక్ సమ్మేళన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. Op సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.

News April 2, 2026

హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

image

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.