News October 12, 2025
స్కూల్స్‌లో UPIతో ఫీజుల చెల్లింపు!

దేశంలో UPI పేమెంట్స్‌కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూల్స్‌లో ఫీజుల వసూలు ప్రక్రియను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం కోరింది. అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజు, స్కూళ్లకు సంబంధించిన లావాదేవీలకు UPI, మొబైల్ పేమెంట్స్ వంటి ఆధునిక విధానాలను వినియోగించాలని విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. CBSE, కేంద్రీయ విద్యాలయ, నవోదయ వంటి విద్యాసంస్థలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
Similar News
News October 12, 2025
నీటి హక్కుల విషయంలో రాజీలేదు: ఉత్తమ్

TG: బనకచర్ల ప్రాజెక్ట్ DPR పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్న మాజీమంత్రి <<17976308>>హరీశ్<<>> రావు విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఖండించారు. ‘హరీశ్‌రావు అబద్ధాలు చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. నీటి హక్కుల విషయంలో రాజీపడేది లేదు. KCR హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తుమ్మిడిహట్టికి DPR రూపొందించి బ్యారేజ్ నిర్మిస్తాం’ అని తెలిపారు.
News October 12, 2025
సతీదేవిని పుట్టింటికి వెళ్లొద్దన్న శివుడు

తండ్రి దక్షుడు చేయనున్న యాగం గురించి విన్న సతీదేవి పుట్టింటికి వెళ్లాలని శివుడి అనుమతి కోరింది. కానీ తనను అవమానించిన దక్షుడి ఇంటికి వెళ్లకూడదంటాడు పరమశివుడు. ఆహ్వానం లేని చోటుకు, శత్రుత్వం ఉన్నవారి ఇంటికి వెళ్తే అవమానం తప్పదని హెచ్చరించాడు. అతిథి లోపాలు వెతికే స్వభావం గలవారితో ఘర్షణ జరుగుతుందని చెప్పాడు. అయినా ఆమె తన పట్టు వదలకుండా తండ్రి ఇంటికి వెళ్లే హక్కు తనకుందని వాదించింది. <<-se>>#Shakthipeetam<<>>
News October 12, 2025
డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్నిరకాల పండ్లు తినొచ్చని, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, జామపండు, ఆపిల్, ఆరెంజ్, కివీ, బొప్పాయి, ద్రాక్ష (కొద్ది మోతాదులో) మంచి ఆప్షన్లు అని అంటున్నారు. వీటిని జ్యూస్ చేసుకునే బదులు పండ్లుగా తింటేనే ఆరోగ్యానికి లాభం అని సూచిస్తున్నారు.
Share it