News May 19, 2024
‘ఐదు రోజుల్లో రూ.7546 కోట్ల చెల్లింపులు’

AP: ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు రూ.7546.34 కోట్ల చెల్లింపులు జరిపామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ తెలిపారు. ఎన్నికల నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. డీబీటీ పథకాల నిమిత్తమే రూ.5866.26 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్ర పథకాలు, అప్పులు, జీతాలు, పెన్షన్లు, పాలనాపరమైన ఖర్చులు, తదితర వాటికి మిగతా మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.
News November 26, 2025
₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పథకం

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News November 26, 2025
చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.


