News August 29, 2024

కౌలు రైతులకు త్వరలోనే చెల్లింపులు: నారాయణ

image

AP: అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా అమరావతిలోని రైతుల ఖాతాల్లో కౌలు నిధులను జమ చేస్తామని వెల్లడించారు. నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Similar News

News January 30, 2026

7 జిల్లాల్లో 64 లక్షల చొరబాటుదారులు: షా

image

20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అస్సాం జనాభాలో సమూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 7 జిల్లాల్లోకి దాదాపు 64 లక్షల మంది చొరబడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ వలసలను సామాన్యులే ఆపాలని.. అందుకు తుపాకులు పట్టుకొని బార్డర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి BJPకి ఓటు వేస్తే సరిపోతుందన్నారు. 126 అసెంబ్లీ సీట్లున్న అస్సాంలో మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

News January 30, 2026

కొమ్మ కత్తిరింపుల వల్ల కోకో పంటలో లాభమేంటి?

image

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.

News January 30, 2026

418 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

తమ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో 418 ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ మేనేజ్‌మెంట్, తదితర విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.