News August 22, 2024
జొమాటో చేతికి పేటీఎం టికెట్ బుకింగ్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మధ్య భారీ డీల్ కుదిరింది. పేటీఎంలోని తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటోకు రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్ తెలిపింది. దీని ప్రకారం పేటీఎంలోని మూవీస్, స్పోర్ట్స్, ఈవెంట్స్ టికెట్ బుకింగ్ సేవలు జొమాటోలోకి వెళ్లనున్నాయి. ఈ బదిలీకి 12 నెలల సమయం పట్టే అవకాశముందని సమాచారం.
Similar News
News September 19, 2025
అమెరికాలో గొడవ.. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్‌నగర్ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్‌మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు.
News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
News September 19, 2025
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.