News April 2, 2025

టాప్-2లోకి దూసుకొచ్చిన PBKS

image

LSGపై ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా ఈ మూడు జట్లు ఇప్పటివరకూ కప్ కొట్టకపోవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో GT, MI, LSG, CSK, SRH, RR, KKR ఉన్నాయి.

Similar News

News November 24, 2025

జిల్లా కలెక్టరేట్లో రేపు దిశ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం 11 గం.కు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలని కోరారు.

News November 24, 2025

బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

image

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్‌(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.