News April 5, 2025
టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News April 5, 2025
నేడు స్కూళ్లకు సెలవు

నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు సైతం పని చేయవు. అటు ఏపీలో ఇవాళ పబ్లిక్ హాలిడే ప్రకటించకపోవడంతో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. చిన్న వయసులోనే కులవివక్షను ఎదుర్కొన్న జగ్జీవన్ రామ్.. అణగారిన వర్గాల కోసం పోరాడారు. మన దేశంలో అత్యధిక కాలం (30 ఏళ్లు) కేంద్రమంత్రిగా పని చేసిన రికార్డు ఈయనదే.
News April 5, 2025
EAPCETకు 2.91లక్షల దరఖాస్తులు

TG EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 2,91,965 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,10లక్షలు, అగ్రికల్చర్‌కు 81,172, రెండింటి కోసం 226 మంది అప్లై చేశారు. దరఖాస్తు చేసుకోని వారు రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 8 వరకు, రూ.500 లేట్ ఫీజుతో 14వ తేదీ వరకు, రూ.5వేలతో ఈనెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
News April 5, 2025
ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్

* కండరాలను రిలాక్స్ చేసేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
* నవ్వేందుకు కాస్త సమయం కేటాయించండి.
* ధ్యానం, శ్వాస వ్యాయామాలు (గ్రౌండింగ్ టెక్నిక్స్) పాటించండి.
* అనవసరమైన బాధ్యతలు తీసుకోకుండా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి.
* నమ్మకమైన వ్యక్తితో మీ భావాలు పెంచుకోండి. పాజిటివ్ మాటలు పంచుకోండి.