News October 30, 2024

PBKS సంచలన నిర్ణయం: అర్ష్‌దీప్ రిలీజ్?

image

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్‌దీప్‌ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్‌దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.

Similar News

News February 7, 2026

ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.

News February 7, 2026

రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

image

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.

News February 7, 2026

APPLY NOW: C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.