News April 5, 2025
PBKSvsRR: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్‌మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‌సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.
Similar News
News September 20, 2025
అల్పపీడనం ముప్పు.. అతిభారీ వర్షాలకు అవకాశం!

తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది తుఫానుగా మారే అవకాశమూ ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
News September 20, 2025
AIIMSలో 77 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్ AIIMSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,170. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, జీతభత్యాల వివరాల కోసం <
#ShareIt
News September 20, 2025
40 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

* అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్(SAC)లో సైంటిస్ట్, అసోసియేట్ పోస్టులు- 13. దరఖాస్తుకు చివరి తేదీ SEP 22. వెబ్‌సైట్: https://www.sac.gov.in/careers/
* కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదిక వెల్డర్, ఫిట్టర్ ఉద్యోగాలు- 27. ఈ నెల 26న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://konkanrailway.com/