News December 16, 2024

పీసీబీ నన్నసలు కోచ్‌గానే పరిగణించలేదు: గిలెస్పీ

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొన్న జాసెన్ గిలెస్పీ ఆ దేశ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హై పర్ఫార్మెన్స్ కోచ్‌గా టిమ్ నెల్సన్‌ మంచి ఫలితాల్ని తీసుకొచ్చారు. అయినా సరే నాకు కూడా చెప్పకుండా ఆయన్ను పీసీబీ తొలగించింది. ఏ అంశంపైనా నాకు ముందస్తు సమాచారం ఇచ్చేవారు కాదు. అసలు నేనున్నట్లే లెక్కచేయలేదు. అలాంటప్పుడు నేను హెడ్ కోచ్‌గా కొనసాగడం అనవసరం అనిపించింది’ అని వివరించారు.

Similar News

News November 23, 2025

ఉమ్మడి వరంగల్‌లో 1,708 పంచాయతీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 మండలాల్లో మొత్తం 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ కోసం 15,006 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
WGL(11): 317 జీపీలు, 2,754 వార్డులు
HNK(12): 210 జీపీలు, 1,986 వార్డులు
జనగామ(12): 280 జీపీలు, 2,534 వార్డులు
మహబూబాబాద్(18): 482 జీపీలు, 4,110 వార్డులు
ములుగు(10): 171 జీపీలు, 1,520 వార్డులు
భూపాలపల్లి(12): 248 జీపీలు, 2,101 వార్డులు

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News November 23, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/