News October 27, 2024
ఫఖర్ జమాన్‌కు పీసీబీ ఝలక్
పాకిస్థాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు PCB ఝలక్ ఇచ్చింది. అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించింది. అలాగే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్‌లకు కూడా ఎంపిక చేయలేదు. మరోవైపు బాబర్ ఆజమ్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసి, జింబాబ్వే టూర్‌కు పక్కనబెట్టింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు నుంచి బాబర్‌ను తప్పించడంతో ఆయనకు మద్దతుగా ఫఖర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనిపై PCB సీరియస్‌గా వ్యవహరించింది.
Similar News
News November 1, 2024
అరబ్ అమెరికన్లలో అయోమయం
గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఆయుధ, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న డెమోక్రటిక్ ప్రభుత్వంపై అరబ్ అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. 40 వేల మందికిపైగా పాలస్తీనియన్ల నరమేధంలో డెమోక్రాట్లు భాగమయ్యారని గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో వారు ట్రంప్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. దీంతో తాను అధికారంలోకి వస్తే గాజాలో యుద్ధం ఆపేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.
News November 1, 2024
డీకే వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో కాంగ్రెస్!
కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమీక్షిస్తామన్న DK శివకుమార్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు ఆ పార్టీకి లాభం చేశాయి. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో INC ఈ తరహా హామీలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో పథకాన్ని సమీక్షిస్తామని చెప్పడం ఇతర రాష్ట్రాల్లో హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తినట్టైంది.
News November 1, 2024
ఆ నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారు: నోరా ఫతేహీ
కెరీర్ ఆరంభంలో చేసిన రెండు సినిమాల నిర్మాతలు తనకు డబ్బులు ఎగ్గొట్టారని నటి నోరా ఫతేహీ ఆరోపించారు. తాను వాటి గురించి కూడా పట్టించుకోలేదని, కెరీరే ముఖ్యమని నమ్మినట్లు చెప్పారు. ‘మోడల్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు దోపిడీకి గురయ్యా. ఏజెన్సీ వాళ్లు డబ్బులిచ్చేవారు కాదు. ఇంటి అద్దె కట్టలేకపోయా. యశ్‌రాజ్ ఫిల్మ్ వారికి ఆడిషన్ ఇవ్వగా అందంగా లేనన్నారు. కోపమొచ్చి ఫోన్ పగలకొట్టా’ అని ఆమె చెప్పుకొచ్చారు.