News August 29, 2024
జై షాకు ఓటేయని పీసీబీ

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికైన సంగతి తెలిసిందే. మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది ఆయనకు అనుకూలంగా ఓటేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఒక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆయనకు ఓటు వేయలేదని తెలిపాయి. షా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పీసీబీ ప్రేక్షక పాత్ర పోషించినట్లు వెల్లడించాయి. కాగా జై షా(36) పిన్న వయసులోనే ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
Similar News
News March 5, 2026
GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.
News March 5, 2026
అధికారులు బడి భోజనం చేయాల్సిందే..

TG: స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను సర్కారు సీరియస్‌గా తీసుకుంది. అలాంటివి జరగకుండా కలెక్టర్ నుంచి స్పెషలాఫీసర్లు, ఇతర అధికారులు హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేయాలని CM ఆదేశించారు. రానున్న ‘99 రోజుల ప్రజాపాలన’ నుంచే దీనిని ఆరంభించాలన్నారు. విద్యా సంవత్సరం మొత్తం అమల్లో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భుజించాలన్నారు.
News March 5, 2026
సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్!

ప్రపంచకప్ గెలవాలనుకున్న సౌతాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది. T20 WC-2026లో సెమీస్‌లో బోల్తా పడింది. ఈ ఎడిషన్‌లో ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన SA ఆశలపై న్యూజిలాండ్ <<19299856>>నీళ్లు చల్లింది<<>>. 2024 ఫైనల్‌లోనూ చివరి దాకా పోరాడి ఇండియా చేతిలో SA ఓడిపోయింది. గతేడాది మహిళల జట్టు ODI WC ఫైనల్‌లో భారత్ చేతిలోనే పరాజయం పాలైంది. తాజా ఓటమితో సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. better luck next time.


