News August 17, 2025

సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

Similar News

News August 17, 2025

గీత కార్మికులకు త్వరలో ద్విచక్ర వాహనాలు: మంత్రి

image

AP: గీత కార్మికుల కోసం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ స్కీమ్ కింద వారికి ద్విచక్ర వాహనాలు (మోపెడ్) అందజేస్తామన్నారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు ఇస్తామని చెప్పారు. రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారు చేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని CM ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News August 17, 2025

మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు

image

మేడ్చల్ సరోగసీ <<17424309>>కేసులో<<>> మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశముంది. నిందితురాలు లక్ష్మీకి HYDలో పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. IVF సెంటర్ల రికార్డులను పరిశీలించనున్నారు. లక్ష్మీ 50 మందికి పైగా సరోగసీ చేయించినట్లు తెలుస్తోంది. అండాలు ఇస్తే ₹30 వేలు, పిల్లలను కనిస్తే ₹4 లక్షలు ఇస్తూ దందా చేసినట్లు సమాచారం. ఆమెపై ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.

News August 17, 2025

ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్లకు షాక్

image

SEP 9 నుంచి జరిగే ఆసియా కప్(T20)కు పాక్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

జట్టు: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, H నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, M హరీస్(WK), M నవాజ్, వసీమ్ Jr, సహిబ్జాదా ఫర్హాన్, S అయూబ్, S మీర్జా, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ మొకిమ్.