News August 27, 2024
రేపు పీసీసీ చీఫ్ ప్రకటన?

TG: కాంగ్రెస్ అధిష్ఠానం రేపు పీసీసీ చీఫ్‌ను ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.