News February 28, 2025
నేడు పీసీసీ సమావేశం.. చీఫ్ గెస్టులుగా రేవంత్, మీనాక్షీ

TG: హైదరాబాద్లోని గాంధీభవన్లో మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ టీపీసీసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు సీఎం రేవంత్, ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షీ నటరాజన్ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల విషయంలో బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షీని కోరే అవకాశం ఉంది.
Similar News
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News December 6, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
News December 6, 2025
iBOMMA కేసు.. BIG TWIST

TG: iBOMMA రవి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకోలేదు. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతివ్వగా పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. 3 రోజుల కస్టడీ సరిపోదని, మరింత గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. దీంతో అతను మరిన్ని రోజులు జైలులో గడపాల్సి ఉంటుంది. అలాగే రవి బెయిల్ పిటిషన్పైనా కోర్టు ఎల్లుండే వాదనలు విననుంది.


