News February 13, 2025
కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్
TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.
Similar News
News February 13, 2025
మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను (చనిపోయిన లేదా సజీవంగా) తాకడం, చంపడం, దగ్గరగా మెలగడం ద్వారా మనుషులకు ఆ వైరస్ సోకుతుంది. కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 3-5 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు. టామీఫ్లూ, రెవెంజా వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ వాడుతారు. చనిపోయే ప్రమాదం చాలా తక్కువ.
News February 13, 2025
గొడవలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది: చింతమనేని
AP: మాజీ MLA అబ్బయ్య చౌదరి డ్రైవర్ను <<15445652>>తిట్టారని<<>> తనపై YCP ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ‘నా కారుకు ఎదురుగా కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారు అడ్డు పెట్టించారు. నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని YCP ప్లాన్ చేస్తోంది. ఈ ఘటనను CM, Dy.CM దృష్టికి తీసుకెళ్తా. పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు’ అని చెప్పారు.
News February 13, 2025
కోడి పందేలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కు చెందిన మొయినాబాద్ ఫామ్హౌస్లో కోడి పందేలు కలకలం రేపాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్వహణపై ఆయనను విచారించనున్నారు.