News February 20, 2025
ప్చ్.. ట్రంప్తో గోక్కుంటున్న జెలెన్ స్కీ!

డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు చైనా సహా ఆర్థికంగా బలమైన దేశాలే వణుకుతున్నాయి. యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మాత్రం ఆయనతో నేరుగా తల గోక్కుంటున్నారు. ట్రంప్ సొంత కంపెనీ ‘ట్రూత్ సోషల్’ను నిషేధించారు. US AID సహా అన్ని నిధులను కట్ చేయడంతో ఫ్రస్ట్రేషన్లో ఆయనీ పని చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ను గౌరవిస్తానని కాకపోతే ఆయన రష్యా చెబుతున్న తప్పుడు సమాచార ప్రపంచంలో బతుకుతున్నారని సెటైర్ వేశారు.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


