News September 9, 2025

ప్చ్.. ఓటేయడం రాని నేతలను ఎన్నుకున్నాం!

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 6, 2026

డిసెంబర్‌లో మహిళలకు చీరలు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. వారికి డిసెంబర్‌లో చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ ‘గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. పాల పిట్టల్లా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి చిలక పచ్చ రంగు చీరలకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నా. పుట్టింటి సారెలా ఆడబిడ్డలకు చీరలు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

News April 6, 2026

వర్షంతో ఆగిన మ్యాచ్

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKR, PBKS మ్యాచ్ వర్షంతో ఆగింది. 3.4 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. భారీ వాన పడుతుండటంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి KKR స్కోర్ 25-2గా ఉంది. అలెన్ 6, గ్రీన్ 4 పరుగులు చేసి బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

News April 6, 2026

‘లాకప్ డెత్’.. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన కేసు

image

TNలోని మదురై <<19583236>>కోర్టు<<>> తీర్పుతో లాకప్‌డెత్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌లో షాప్స్ త్వరగా మూసివేయిస్తున్నారని జయరాజ్ చేసిన విమర్శతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన కొడుకునీ లాకప్‌లో వేసి హింసించడంతో వారు చనిపోయారు. దీనిని పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా నిరసనలు చెలరేగడంతో కేసును CBI టేకోవర్ చేసింది. ఐదేళ్లలో 100 మందికిపైగా సాక్షులను విచారించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.