News April 25, 2024
చాలామంది మహిళలకు నరకం ‘PCOD’

యూపీ టెన్త్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన బాలిక ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటాన్ని పలువురు ట్రోల్ చేశారు. ఆ పరిస్థితిని PCOD అంటారని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తే ఈ ప్రాబ్లమ్ వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, బరువు పెరగడం వంటి పలు ఇబ్బందుల్ని PCOD మహిళలు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి వీలైతే అండగా ఉండాలి తప్ప గేలి చేయడం సరికాదని సూచిస్తున్నారు నిపుణులు.
Similar News
News March 28, 2026
వైసీపీ గైర్హాజరు.. జగన్ మదిలో ఏముంది?

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చకూ వైసీపీ గైర్హాజరైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. తమ పార్టీ, జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మరి ఇవాళ తీర్మానంపై చర్చకైనా ఆ పార్టీ ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అమరావతికి జగన్ అనుకూలంగా లేరా? ఆయన మదిలో ఏముంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
News March 28, 2026
పార్లమెంటులో వైసీపీ ఏం చేస్తుందో చూడాలి: లోకేశ్

AP: రాజధానిపై అసెంబ్లీ చేసిన తీర్మానం ఈ రోజే కేంద్రానికి వెళ్తుందని మంత్రి లోకేశ్ చిట్‌చాట్‌లో తెలిపారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపుతుందని, 2న పార్లమెంటులో ప్రవేశపెడతారని చెప్పారు. అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ పార్లమెంటులో ఏం చేస్తుందో చూడాలన్నారు. జగన్ సినిమా ఏంటో గత ఎన్నికల్లో తేలిపోయిందని, ఇంకేం సినిమా చూపిస్తారని ప్రశ్నించారు.
News March 28, 2026
ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.


