News November 7, 2025

PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

image

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.

Similar News

News November 7, 2025

₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

image

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్‌ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.

News November 7, 2025

ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

image

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.

News November 7, 2025

టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

image

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.