News March 10, 2026

PCOSతో దంత సమస్యలు

image

పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు నిపుణులు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో దంత సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు సూచిస్తారని చెబుతున్నారు.

Similar News

News March 11, 2026

‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

image

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

News March 11, 2026

2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

image

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.

News March 11, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 11)

image

1689: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మరణం
1915: భారత లెజెండరీ క్రికెటర్ విజయ్ హజారే జననం (ఫొటోలో)
1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
1979: తెలుగు సాహితీకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం