News March 24, 2025
PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.
Similar News
News April 18, 2025
ADB: రాష్ట్ర మంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే

ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు స్థానిక ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు భోరజ్ మండలం పూసాయిలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు మావలలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
News April 18, 2025
MNCL: ఎల్లుండి నుంచే పరీక్షలు.. చదువుకున్నారా..?

జిల్లాలో పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్ పరీక్షలు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,192 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు గంట ముందు సెంటర్లకు హాజరు కావాలని సూచించారు.
News April 18, 2025
నిర్మల్: మండలాలకు చేరుతున్న ఎన్నికల సామగ్రి

సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్షన్లకు సామగ్రిని ఎంపీడీవో ఆఫీస్‌లకు చేరుకున్నాయి. గురువారం కుబీర్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఎలక్షన్ సామగ్రిని ఎంపీడీవో నవనీత్ కుమార్, ఎంపీఓ మోహన్ సింగ్ పరిశీలించారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధంగా ఉంటామని, జీపీల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో తెలిపారు.