News March 27, 2025
PDPL: ఈసారైనా మంత్రి పదవి దక్కేనా!

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ చేయనుండడంతో CM రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న MLA విజయ రమణారావు మంత్రి పదవి దక్కేనా అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
Similar News
News December 22, 2025
నెల్లూరు: కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ ఆవిష్కరణ

APSPDCLఆధ్వర్యంలో రూపొందించిన కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఆవిష్కరించారు. వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం, శుక్రవారం జనబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారులతో మమేకం కానున్నారు.
News December 22, 2025
పుట్టపర్తిలో 330 అర్జీల స్వీకరణ

పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలపై శ్రద్ధ పెట్టి ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. మొత్తం 330అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశామన్నారు.
News December 22, 2025
మే 12 నుంచి EAPCET

AP: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (CETs)-2026 షెడ్యూల్ను APSCHE విడుదల చేసింది. ఆయా సెట్ల పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
*EAPCET (Eng): 12, 13, 14, 15, 18
*EAPCET (agri, pharm): మే 19, 20
*ECET: ఏప్రిల్ 23
*ICET: ఏప్రిల్ 28
* LAW, EDCETs: మే 4
*PGECET: ఏప్రిల్ 29, 30, మే 2
*PGCET: మే 5, 8, 9, 10, 11


