News March 17, 2025
PDPL: ఉచిత ఆర్మీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువకులు ఆన్లైన్లో అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకొని, చేసుకున్న దరఖాస్తు ఫారం జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు- 9440167222, 8333044460 కాంటాక్ట్.
Similar News
News November 12, 2025
పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
News November 12, 2025
నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి
News November 12, 2025
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


