News April 2, 2025

PDPL: ఎస్సారెస్పీ కాల్వలను పరిశీలించిన కలెక్టర్

image

చివరి ఆయకట్టు వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం ఆయన కమాన్‌పూర్, పెద్దపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎస్సారెస్పీ డీ-83 కాలువను కమాన్‌పూర్ మండలం గుండారం వద్ద ఎస్సారెస్పీ కెనాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు అవసరమైన సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలన్నారు.

Similar News

News November 9, 2025

బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

image

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.

News November 9, 2025

సంగారెడ్డి: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. నేటి నుంచి మొత్తం 4 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ బస్సులు ఉదయం 4:10, 5:50 గంటలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News November 9, 2025

ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

image

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.