News April 2, 2025
PDPL: కస్టమర్లకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

పెద్దపల్లి కలెక్టరేట్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ యూనిట్ల స్థాపనకు సహకారం చుట్టామన్నారు.
Similar News
News November 27, 2025
VKB: 262 జీపీలకు నేటి నుంచి నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో ఉ.10:30 గం. నుంచి సా.5 గ. వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,058 వార్డులు ఉండగా తొలి విడతలో 8 మండలాల పరిధిలోని 262 సర్పంచ్, 2,198 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పబ్లిక్ టాక్

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ప్రీమియర్లు USAలో మొదలయ్యాయి. RA-PO వన్ మ్యాన్ షో చేశాడని, చాలారోజుల తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడిందని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కుదిరిందంటున్నారు. స్క్రీన్‌ప్లే బాగుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. కొన్నిసీన్లు అసందర్భంగా వస్తాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News November 27, 2025
కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.


