News October 28, 2024
PDPL: కస్తూరిబా విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం మండలంలోని కస్తూరిబా విద్యాలయం విద్యార్థులు నిన్న రాత్రి అస్వస్థతకు గురై, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు.
Similar News
News October 28, 2025
హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.
News October 28, 2025
కరీంనగర్: ఉరివేసుకొని రాజస్థాన్ కూలి మృతి

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ కూలి ఉరివేసుకుని మృతి చెందాడు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన బూర రామ్ గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాయికి ఉంటున్న ఇంట్లోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News October 28, 2025
KNR: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ పమెల సత్పతి ఆధ్వర్యంలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23 వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.


