News April 8, 2025
PDPL: కుమార్తె ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43)కు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.
Similar News
News November 15, 2025
భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
News November 15, 2025
WGL: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా అమలు చేయాలి!

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమావళి విధిగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని ఇఆర్ఓలు, ఏఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ కార్యక్రమం పురోగతి, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలపై ఆయన సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ పాల్గొన్నారు.
News November 15, 2025
నర్సంపేట నుంచి అన్నవరానికి సూపర్ లగ్జరీ బస్సు

నర్సంపేట RTC డిపో టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సును ఈరోజు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం ఆర్కే బీచ్, అంతర్వేది, యానాం మీదుగా ఈనెల 18న రాత్రి 9 గం. వరకు నర్సంపేట చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.


