News April 8, 2025
PDPL: కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43) దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.
Similar News
News November 16, 2025
కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 16, 2025
కరీంనగర్: ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
News November 16, 2025
కేశవపట్నం పీఎస్‌లో సీపీ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్‌కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.


