News December 17, 2024
PDPL: కొత్తరేషన్ కార్డుల జారీకి మోక్షం కలిగేనా!

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. ఇదివరకు అక్టోబర్ 2 నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపి వేసింది. దీంతో ఈసారైనా కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలిగేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో 15,675 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News November 27, 2025
KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
News November 27, 2025
రామడుగు: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
News November 27, 2025
కరీంనగర్‌కు వచ్చిన పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు

పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, HACA మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి గురువారం కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.


