News February 5, 2025
PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి ట్రైనింగ్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్‌లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2025
OTTలోకి మహేశ్ ‘ముఫాసా’.. ఎప్పుడంటే?
‘ది లయన్ కింగ్’ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’కు థియేటర్లలో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 18వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో వీడియో ఆన్ డిమాండ్ కింద స్ట్రీమింగ్ కానుంది. అంటే, డబ్బులు చెల్లించి ‘ముఫాసా’ను చూడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫ్రీగా చూసేయొచ్చు. తెలుగులో ముఫాసాకు మహేశ్ వాయిస్ అందించారు.
News February 5, 2025
Breaking: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటిది ఆ ఫామ్‌కు నిప్పుపెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే
➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం