News October 26, 2024
PDPL: డిసెంబర్ వరకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తిచేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. మన జిల్లాలో 324 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మరో 350 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 20, 2025
రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.
News November 20, 2025
హనుమాన్ నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 20, 2025
KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.


