News October 26, 2024

PDPL: డిసెంబర్ వరకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తిచేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్‌పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. మన జిల్లాలో 324 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మరో 350 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 10, 2024

నేడు దద్దరిల్లనున్న పెద్దపల్లి!

image

పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు అఖిల భారత యాదవ సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఉత్సవానికి రాజకీయ, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

News November 10, 2024

కార్తీక పౌర్ణమి ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి: మంత్రి పొన్నం

image

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పంచభూతాలలో ఒకటైన అరుణాచల పుణ్యక్షేత్రానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శన సౌకర్యం ఉంటుందన్నారు.

News November 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ శంకర్ పట్నం మండలంలో లారీ, బైకు డీ.. ఒకరి మృతి. @ చెందుర్తి మండలంలో బస్సు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ధర్మపురిలో వైభవంగా గోదావరి మహా హారతి. @ మాజీ ఎమ్మెల్యే జ్యోతి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. @ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత దంపతుల ఆత్మహత్య. @ జగిత్యాల మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.