News March 16, 2025
PDPL: డ్రగ్స్ నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: అదనపు కలెక్టర్

పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టే చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతిశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు.
Similar News
News March 15, 2026
రేపు నెల్లూరు జైలు వద్దకు వెళ్లనున్న MP మిథున్ రెడ్డి

నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వెళ్లనున్నారు. జైల్లో ఉన్న మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో వారు మూలాఖత్ కానున్నారు. వీరితో పాటు స్థానిక వైసీపీ నేతలు జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 15, 2026
రేపటి ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2025 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహశీల్దారులు, ఎంపీడీవోల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్న కారణంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం

కొడంగల్ మండలం రావులపల్లికి చెందిన రామ్ రెడ్డి (62) ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకొని మృతి చెందాడు. ఆదివారం పొలం గట్టుపై ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అదే మంటల్లో పడి మృతి చెందినట్లు బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


