News July 17, 2024
PDPL: తాగుడు అపేయాలన్నందుకు యువకుడి సూసైడ్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. ఎస్సై లక్ష్మణ్ వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన రాజ్ కుమార్(20) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగడం ఆపేయాలని తండ్రి.. కుమారుడిని మందలిస్తూ వస్తున్నాడు. మనస్తాపానికి గురైన రాజ్ కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 10, 2024
KNR: సోషల్ మీడియా క్రేజ్‌లో యువత చిత్తు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా క్రేజ్‌లో పడి యువత తమ బంగారు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కుటుంబంతో గడపడం కంటే యువత స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని తెలిసిన కొందరు యువతులు లైకులు, కామెంట్ల కోసం ఇటీవల ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
News December 10, 2024
ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ: KNR ఆర్టీసీ RM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ రాయితీ ఈనెల 1 నుంచి 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ గంభీరావుపేట మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
@ రాయికల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల డిఎస్పీ.
@ కరీంనగర్ ప్రజావాణిలో 208 ఫిర్యాదులు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్పల్లి మండలం ఆరపేటలో వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు తాజా మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్.