News April 4, 2025

PDPL: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 28, 2025

సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: sebi.gov.in

News November 28, 2025

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా?

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఆయన 845 రోజులుగా నిర్బంధంలోనే ఉండగా.. గత నెల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్‌’లో వేశారు. ఇమ్రాన్‌‌ను చంపడం వల్లే ఎవరినీ అనుమతించడం లేదని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని పాక్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాంటప్పుడు ఆయనను బయటి ప్రపంచానికి చూపించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

News November 28, 2025

శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

image

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.