News January 23, 2025
PDPL: ఫిబ్రవరి 1లోగా గురుకుల ప్రవేశాల దరఖాస్తు సమర్పించాలి: RDO

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య పేర్కొన్నారు. గురువారం గురుకుల అధికారులతో RDO సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను తహశీల్దారులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్ 18005985459 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.
News December 2, 2025
ఖమ్మం: అన్నా.. తమ్మీ.. ‘జర’ విత్డ్రా చేసుకోరాదూ!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కోసం పైరవీలు ఊపందుకున్నాయి. తొలి విడత ఉపసంహరణకు గడువు రేపటితో ముగుస్తుండటంతో, ప్రధాన పార్టీలు పోటీని తగ్గించుకునే పనిలో పడ్డాయి. “అన్నా.. తమ్మీ.. ఇద్దరం పోటీలో ఉంటే నష్టపోతాం, జర విత్డ్రా చేసుకోరాదు” అంటూ పోటీదారుల మధ్య బుజ్జగింపులు, మాటలు గ్రామాల్లో సాధారణమైంది. దీంతో అనేక చోట్ల విత్డ్రాలు జరుగుతున్నాయి.
News December 2, 2025
‘ఏలూరు కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం’

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ మాపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.


