News March 20, 2025
PDPL: ముగిసిన ఇంటర్ పరీక్షలు: జిల్లా అధికారి కల్పన

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. నేటి పరీక్షకు 4532 మంది హాజరు కావాల్సి ఉండగా, 4428 మంది హాజరు కాగా, 104 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అన్నారు. ఇవాళ 97.7% హాజరు నమోదయిందన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 30, 2025
నిజామాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్(48) తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 30, 2025
కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.
News October 30, 2025
SRSP UPDATE: 26 గేట్ల ద్వారా నీటి విడుదల

విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో SRSP నుంచి గురువారం ఉదయం 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,09,654 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.50 TMCలకు గాను తాజాగా 80.501 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.


