News March 17, 2025
PDPL: రాజీవ్ యువ వికాసం.. యువతలో ఆశలు..!

‘రాజీవ్ యువ వికాసం’తో ఉమ్మడి KNR జిల్లాలోని యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనున్నారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారికి రూ.3 లక్షలలోపు విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in సైట్ను వీక్షించవచ్చు. SHARE IT.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


