News July 8, 2025
PDPL: ‘ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి’

ఈ నెల 15లోపు SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో కూడిన ఆధారాలు, పేపర్ క్లిప్పింగ్‌లు, ఫొటోలు, స్వచ్ఛంద సేవ సంస్థలకు చేసిన సేవలతో కూడిన ఆధారాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులకు ఎలాంటి పారితోషకాలు ఉండవని స్పష్టం చేశారు.
Similar News
News July 8, 2025
నకిలీ పత్రాలతో దరఖాస్తులు.. JNTU అనుమతులు!

కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాల నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు తీసుకుందని విజిలెన్స్ నివేదికలో తేలినా కౌన్సెలింగ్‌లో మరోసారి అనుమతి ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు పొందుతున్న విద్యాసంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించినా ఇప్పటివరకు JNTU అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
News July 8, 2025
HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్‌ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్‌ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్‌ను బయటకు తీశారు.
News July 8, 2025
Historic Moment

శ్రీశైలం డ్యాం చరిత్రలో జులైలో గేట్లు తెరుస్తుండటం ఇది ఐదోసారి. సాధారణంగా ఆగస్టు, SEPలో గేట్లు ఎత్తుతుంటారు. ఈసారి జూన్‌లోనే ఎగువన వర్షాలు కురవడంతో డ్యాంకు వరద భారీగా చేరుతోంది. కొన్నిగంటల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
★ జులైలో గేట్లు ఎత్తిన సందర్భాలు..
2025: జులై 8, 2007: జులై 23, 2021: జులై 28, 2022: జులై 23, 2024: జులై 29