News March 17, 2025

PDPL: ఉచిత ఆర్మీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువకులు ఆన్లైన్లో అగ్నిపథ్‌‌కు దరఖాస్తు చేసుకొని, చేసుకున్న దరఖాస్తు ఫారం జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు- 9440167222, 8333044460 కాంటాక్ట్.

Similar News

News March 17, 2025

ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా?

image

ప్రతి మహిళకు ఏడువారాల నగలు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మందికి 7 వారాల నగలేంటో తెలియదు. ఆదివారం(సూర్యుడు) ధరించేవి కెంపుల కమ్మలు & హారాలు, సోమవారం(చంద్రుడు) ముత్యాల హారం & గాజులు, మంగళవారం(కుజుడు) పగడాల దండలు& ఉంగరాలు, బుధవారం(బుధుడు) పచ్చల పతకాలు& గాజులు, గురువారం(బృహస్పతి) పుష్యరాగం& కమ్మలు& ఉంగరాలు, శుక్రవారం(శుక్రుడు) వజ్రాల హారాలు& వజ్రపు ముక్కుపుడక, శనివారం(శని) నీలమణి హారాలు. share it

News March 17, 2025

నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 72 అర్జీల రాక

image

నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. మొత్తం 72 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను విచారించి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా.. త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. 

News March 17, 2025

కృష్ణా: జిల్లాలో TODAY TOP NEWS

image

★ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు..<<15794120>> 286 గైర్హాజరు <<>>
★ కృష్ణా: Way2Newsతో విద్యార్థులు
★ కృష్ణా: టెన్త్ విద్యార్థులకు యూనిఫామ్<<15791358>> అనుమతి లేదు<<>>
★ అసెంబ్లీలో గన్నవరం <<15790326>>ఎమ్మెల్యే ఆవేదన<<>>
★ కృతి వెన్నులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ అవనిగడ్డలో కొడుకు ముందే తల్లి మరణం
★ పెడనలో టీడీపీ <<15787375>>నాయకుడిపై దాడి<<>>
★ గన్నవరంలో వెటర్నరీ విద్యార్థుల<<15792654>> ఆందోళన<<>>

error: Content is protected !!