News December 1, 2025

PDPL: ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్‌ను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి–యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు సమయానికి అందించాలని సూచించారు.

Similar News

News April 5, 2026

టాస్ గెలిచిన చెన్నై

image

IPL: RCBపై చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచు జరగనుంది.
CSK: రుతురాజ్ (C), శాంసన్, ఆయుష్, సర్ఫరాజ్, ప్రశాంత్ వీర్, దూబే, నూర్ అహ్మద్, ఓవర్టన్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, పాటిదార్(C), జితేశ్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, జాకబ్ డఫీ.

News April 5, 2026

సమ్మర్‌లో కుక్కలు డేంజర్.. ఎందుకో తెలుసా?

image

వేసవిలో కుక్కలు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అసౌకర్యం వల్ల చిరాకు పెరిగి, ఎవరు దగ్గరకు వచ్చినా దాడి చేసే అవకాశం ఉంది. నీరు దొరకకపోతే డీహైడ్రేషన్‌కు గురై దూకుడుగా ప్రవర్తిస్తాయి. వేసవిలో చాలా కుక్కలు పిల్లలను కంటాయి. ఆ సమయంలో పిల్లల రక్షణ కోసం ఎవరు దగ్గరకు వచ్చినా ప్రమాదంగా భావించి కరుస్తాయి. కుక్కల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

News April 5, 2026

సిరిసిల్ల : విద్యుత్ సిబ్బందికి రక్షణ కవచాలు అందజేత

image

విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో ఎన్పీడీసీఎల్ ముందడుగు వేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి రక్షణ కవచాలు అందించింది. లైన్ లో విద్యుత్ సరఫరా ఉంటే తెలిసిపోయేలా ఎర్త్ రాడ్లతో పాటు హెల్మెట్లు, జాకెట్ లు పంపిణీ చేశారు. కాగా సెస్ ను ఎన్పీడీసీఎల్ ఆధీనంలోకి తీసుకున్న మూడు రోజుల్లోనే రక్షణ కిట్లు పంపిణీ చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.