News September 21, 2025

PDPL: కలెక్టర్‌పై ఆరోపణలు ఖండించాలి: శంకర్

image

PDPL కలెక్టర్‌పై నిరాధార ఆరోపణలను టీజ్యాక్ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. RGMలోని ఆశ్రమ పాఠశాల భూ కేటాయింపులో కలెక్టర్ డబ్బులు అడిగారని కొన్నివర్గాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. కలెక్టర్ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తుండగా, ఈ తరహా ఆరోపణలు ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ పటిష్ఠంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Similar News

News September 21, 2025

ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్

image

ప్రొద్దుటూరులో టీడీపీ, వైసీపీ నాయకుల నడుమ పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రభుత్వంలో హోదాలేని MLA కుమారుడు కొండారెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్న అధికారుల పేర్లను బ్యాడ్ మెమోరీస్ బుక్‌లో రాసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శనివారం హెచ్చరించారు. దీనిపై ఆదివారం కొండారెడ్డి స్పందిస్తూ CM రిలీఫ్ ఫండ్ పంపిణీ, మున్సిపాలిటీ సమీక్షలో పాల్గొంటున్నానని చేతనైతే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు.

News September 21, 2025

ప్రకాశంకు ఆరెంజ్ అలర్ట్.. 3 గంటల్లో భారీ వర్షాలు.!

image

ప్రకాశం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం ప్రకటన జారీచేసింది. రాబోయే మూడు గంటల్లో భారీ తుఫానుతోపాటు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ప్రకటించారు. ప్రజలు హోర్డింగుల వద్ద ఉండరాదని, అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు గంటలపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వారు తెలిపారు.

News September 21, 2025

సంతానోత్పత్తిని పెంచే సీడ్ సైక్లింగ్‌

image

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.