News August 19, 2025
PDPL: కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాల చేరిక: DCP

రామగిరి మం. JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేశోరాం ప్లాంట్ అధిపతి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా, PDPL DCP కరుణాకర్, ACP రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు బాధ్యతతో చదువుకుని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించగా, DCP కరుణాకర్ కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాలు చేరుకోగలరన్నారు. క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
Similar News
News August 19, 2025
50 ఏళ్లనాటి రూల్స్‌తో సినిమాలు తీయలేం: SKN

సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదని ప్రొడ్యూసర్ SKN తెలిపారు. 50 ఏళ్ల నాటి రూల్స్‌తో ఇప్పుడు సినిమాలు నిర్మించడం కష్టమని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘కార్మికులు రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువగా వేతనాలు తీసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లో చెల్లిస్తున్న వేతనాల కంటే ఇది చాలా ఎక్కువ. కార్మికులు ఇలాగే నిబంధనలు విధిస్తే ఇతర భాషల మేకర్స్ ఇక్కడికి రాలేరు’ అని పేర్కొన్నారు.
News August 19, 2025
భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

ఆరు నెలల్లోనే తాను 6 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇందులో భారత్-పాక్ యుద్ధం కూడా ఉన్నట్లు ఆయన మరోసారి చెప్పారు. జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను కానీ ఖచ్చితంగా ముగుస్తుంది. 31 ఏళ్లుగా జరుగుతున్న రువాండా-కాంగో యుద్ధాన్ని ఆపా. అలాగే ఈ యుద్ధాన్ని కూడా నిలువరిస్తా’ అని చెప్పుకొచ్చారు.
News August 19, 2025
మహిళలకు ఫ్రీ బస్.. సీఎం మరో గుడ్‌న్యూస్

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ జిరాక్స్‌తో పాటు సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికిపైగా మహిళలు జీరో ఫేర్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు ఆయన తెలిపారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయిందన్నారు. అటు ఘాట్ రోడ్లలోనూ పథకం అమలు చేయాలని సీఎం సూచించారు.