News April 8, 2025

PDPL: కుమార్తె ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43)కు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.

Similar News

News September 18, 2025

పాలమూరు RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత <<17746081>>ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి MBNR రీజియన్‌లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ పోస్టులు 5, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, WNPలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPTలో డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT

News September 18, 2025

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.

News September 18, 2025

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత<<17746081>> ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో 52, మెదక్, సిద్దిపేటలో ఒకటి చొప్పున డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 64, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేటలో 4 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT