News October 28, 2025
PDPL: కోతిని మింగిన కొండచిలువ.. దాన్ని చంపిన వానరాలు

PDPL జిల్లా ముత్తారం(M) కేశనపల్లిలో కోతిని కొండచిలువ మింగేసింది. గ్రామానికి చెందిన చొప్పరి రవి ఇంట్లో చొరబడిన కొండచిలువ అక్కడేఉన్న కోతిని నోటకర్చుకొని మింగుతుండగా మిగితా కోతులొచ్చి దానిని కాపాడే ప్రయత్నం చేశాయి. కోతుల ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ భారీ కొండచిలువ కోతిని మింగింది. ఈ క్రమంలో మిగితా కోతులన్నీ వచ్చి కొండచిలువపై దాడి చేసి దానిని చంపేశాయి. కాగా ఫారెస్ట్ అధికారులు కొండచిలువను పూడ్చిపెట్టారు.
Similar News
News October 29, 2025
CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌తో ఏదో మాట్లాడారు.
News October 29, 2025
మంచిర్యాల: ‘విధినిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి’

ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు విధి నిర్వహణలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సంబంధిత గోడ ప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించనున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
News October 29, 2025
మంచిర్యాల: మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ లొంగుబాటు

మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. మందమర్రిలో పుట్టి పెరిగిన బండి ప్రకాశ్ గత 40సంవత్సరాలపాటు వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో పని చేశారు. బండి ప్రకాశ్ సింగరేణి ప్రాంతంలో సీకాస కార్యదర్శిగా పనిచేసే కార్మికుల ఎన్నో సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రకాశ్ లొంగిపోవడంతో సీకాసకు పెద్ద అండ కోల్పోయినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.


