News September 2, 2025
PDPL: ‘గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుట్ర’

మాజీ CM- KCRపై అక్రమ కేసులు బనాయించి, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసి గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు CM రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని BRS రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం నీటితో సోమవారం జలాభిషేకం చేశారు. ఆయన వెంట BRS పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News September 4, 2025
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
News September 4, 2025
HYD: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా డాక్టర్ గడ్డం వెంకన్న

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్న రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తమ అధ్యాపకుల జాబితా వెల్లడించింది. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వెంకన్న పురస్కారం అందుకోనున్నారు.
News September 4, 2025
నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైంది: మోదీ

దేశం స్వావలంబన సాధించాలని, నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయంతో సైంటిస్టులు కావాలనే కాంక్ష విద్యార్థుల్లో పెరిగిందని చెప్పారు. ‘టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. యువతరానికి దారి చూపాలి. చిన్నారుల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గేమింగ్, గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది’ అని PM వివరించారు.