News February 5, 2025
PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి ట్రైనింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 16, 2025
కొనుగోలు కేంద్రాల్లో 4983 మెట్రిక్ టన్నుల ధాన్యం: కలెక్టర్

జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాకు నేటి వరకు 4983.920 మెట్రిక్ టన్నులధాన్యం చేరుకున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17%తేమతో 2263.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2151.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశామని, 112.360 మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.1.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
News November 16, 2025
ములుగు: కలహాల కాపురం.. దంపతులను కలిపిన న్యాయస్థానం..!

ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన రాజ్ కుమార్, హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన ప్రియాంకకు ఏడాదిక్రితం వివాహమైంది. ఆరు నెలలు గడవక ముందే మనస్పర్థలు పొడచూపాయి. ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది రంగోజు బిక్షపతి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు. ములుగు జిల్లా కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తి కన్నయ్యలాల్ ఎదుట దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. అడ్వకేట్‌ను అందరూ అభినందించారు.
News November 16, 2025
నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).


